NRPT: ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ చెప్పారు.