MBNR: కులాంతర వివాహాలతో సామాజిక సమానత్వానికి బలమైన సందేశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని పాతతోటకు చెందిన ప్రసన్నకుమార్, సుభాష్‌నగర్‌కు చెందిన అక్షిత కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా లభించే 2.5 లక్షలు చెక్కును వారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అందజేశారు.