MBNR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని రూమ్ నెంబర్ 120లో మీడియా సెంటర్ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ప్రారంభించారు. అనంతరం మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా మీడియాకు అందిస్తామన్నారు.