మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం XEV 9sను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కంపెనీ విడుదల చేసిన తొలి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV ఇదే కావడం విశేషం. దీని ప్రారంభ ధర రూ.19.95 లక్షలుగా నిర్ణయించారు. వేరియంట్‌ను బట్టి గరిష్ఠ ధర రూ.29.45 లక్షల వరకు ఉంటుంది. 2026 జనవరి 14 నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. జనవరి 23 నుంచి డెలివరీలు చేపట్టనున్నారు.