MLG: ఏటూరునాగారం మండలం మల్యాల గ్రామంలో చేతి పంపు బోరింగ్ ఐదేళ్లుగా పనిచేయకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగిన లోతు లేకపోవడమే నీరు రాకపోవడానికి కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తాగునీటి కొరతతో సతమతమవుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.