కృష్ణా: నందివాడ జెడ్పీహెచ్ పాఠశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై ఎస్సై శ్రీనివాస్ విద్యార్థులకు అవగాహన కల్పించి, గురువారం ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి ఆయన వివరించారు. ప్రతి బాలుడు, బాలిక విద్యను పూర్తి చేసి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.