CTR: చిత్తూరులో పలమనేరు రోడ్డు విస్తరణ పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ పరిశీలించారు. దర్గా సర్కిల్ నుంచి ఇరువారం వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేపట్టాలన్నారు. మార్కింగ్ చేసిన ప్రదేశాలలో ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ప్రహరీలు తొలగించే పనులు వేగవంతంగా చేయాలన్నారు. పశు వైద్యశాల, కన్నన్ కాలేజీ ప్రహరీ తొలగింపును ఆయన పరిశీలించారు.