MDK: తూప్రాన్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విద్యార్థులకు బ్లాంకెట్లు, స్వెటర్లు, మంకీ క్యాపులు పంపిణీ చేసినట్లు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి లింగేశ్వర్ తెలిపారు. విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతుండడంతో గురువారం రాత్రి సరఫరా అయినట్లు వివరించారు. విద్యార్థులకు వెంటనే అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ జనార్ధన్ పాల్గొన్నారు.