W.G: ఆరోగ్యకరమైన సమాజం కావాలంటే బాల్య వివాహాలను తప్పనిసరిగా అరికట్టాలని ఉండి ఎస్సై నసీరుల్లా అహ్మద్ అన్నారు. గురువారం రాత్రి ఎమ్మార్వో ఆఫీస్ రోడ్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శిశు మరణాల రేటు తగ్గించాలంటే బాల్య వివాహాలు అరికట్టాలని ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు.