ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలంలో భారత స్టార్ ఓపెనర్ ప్రతికా రావల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ వేలంలో ఆమె అమ్ముడుపోలేదు. ప్రపంచకప్-2025లో సత్తా చాటిన ప్రతికాపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా ప్రతికా చీలమండకు గాయమైంది. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతోనే ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనట్లు తెలుస్తోంది.