E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో నవంబర్ 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.