E.G: అన్నదాతల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం నిడదవోలు మండలం తాడిపర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన రైతన్నా మీ కోసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుకున్నారు. అన్నదాతలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.