WGL: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు WGL పోలీస్ కమిషనరేట్ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు CP సన్ ప్రీత్ సింగ్ ఇవాళ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు. స్టేషన్ల వారీగా గ్రామాల వివరాలు సేకరించి, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.