ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం బర్రింకలపాడు క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అలాగే జీలుగుమిల్లిలో జరిగిన కార్యక్రమంలో స్థానికులు సమస్యలు తెలియజేశారు. ప్రతి ఫిర్యాదుకు సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.