KDP: కమలాపురం నియోజకవర్గాన్ని 2047 నాటికి స్వర్ణ కమలాపురంగా మారుస్తామని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గురువారం తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవోతో కలిసి ‘విజన్ యాక్షన్ ప్లాన్’ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.