KRNL: నగర పరిశుభ్రత, ప్రజారోగ్యం, రహదారి, భద్రతపై ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ విశ్వనాథ్ సూచించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగితే నోటీసులు జారీ చేస్తామని, రహదారులపై పశువులను వదిలితే గోశాలకు తరలించి జరిమానా విధిస్తామని తెలిపారు. అలాగే హోటళ్లు, ఫంక్షన్ హాల్స్ మిగిలిన ఆహారాన్ని బహిరంగంగా పారేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.