KDP: అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కమలాపురం ఎమ్మెల్యేలు పుత్తా చైతన్య రెడ్డి, బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డిలు ఆయన వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లి పార్థివదేహానికి పూలమాలతో నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.