ATP: శెట్టూరు మండలం చిన్నంపల్లి జడ్పీ స్కూలు, మంగంపల్లి ఎంపీపీ స్కూళ్లలో కళ్యాణదుర్గం సబ్ డివిజన్ ‘శక్తి టీం’ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించింది. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలు, డీఎస్పీ మహబూబ్ బాషా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. శక్తి యాప్, స్వీయ రక్షణ, డయల్ 100/112 సేవలు, పోక్సో చట్టం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై వివరించారు.