అన్నమయ్య: బీ.కొత్తకోట మండలంలోని గుమ్మసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కోడి కూతల నారాయణమ్మ అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. గ్రామ పంచాయితీలో టీడీపీ బలోపేతానికి ఆమె కీలక పాత్ర పోషించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంపై మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్తో పాటు పలువురు పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.