కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమకు కొంత కాలం కోసం మాత్రమే అధికారం ఇవ్వలేదన్నారు. పూర్తి ఐదేళ్లు పాలించడానికి ఆమోదం తెలిపారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన ‘మాట’ కేవలం నినాదం మాత్రమే కాదని.. అదే తమ ‘ప్రపంచం’ అని వ్యాఖ్యానించారు. అయితే, అంతకుముందు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ‘వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్’ అంటూ ఓ పోస్ట్ చేశారు.