KDP: సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిద్ధవటం ఒంటిమిట్ట టీడీపీ నేతలు గురువారం కడప జిల్లా DRO విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రం సమర్పించారు. రెండు మండలాల ప్రజలు అన్నమయ్య జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 90 కిలోమీటర్ల వెళ్లక తప్పదన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని టీడీపీ నేతలు కోరారు.