KDP: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని భయపెట్టి రూ.1.62 కోట్లు దోచుకున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఆరుగురు నిందితులను పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి రూ.1,05,300 నగదు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబై సీబీఐ అధికారులుగా నటిస్తూ వాట్సాప్ ద్వారా బెదిరింపులు చేసినట్లు మీడియాకు తెలిపారు.