NGKL: లింగాల మండలంలోని అంబటిపల్లి ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి బషీర్ అహ్మద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, ప్రతి ఉపాధ్యాయుడు టీచింగ్ డైరీ ప్రకారం విద్యాబోధన చేయాలని సూచించారు. నవంబర్ 30 లోగా మిడ్ లైన్ టెస్ట్ నిర్వహించాలని, విద్యార్థుల హాజరుపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.