GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు, డీసీ నగర్ ప్రాంతాల్లో ఉన్న హిందూ శ్మశాన వాటికల్లో సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. గురువారం వీటి అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులుని కలిసి వినతిపత్రం అందజేశారు.