ASR: సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజుల చెల్లింపుకు షెడ్యూల్ విడుదలైందని డీఈవో బ్రహ్మాజీరావు గురువారం తెలిపారు. డిసెంబర్ 1నుంచి 15వరకు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 10వరకు, రూ.25 అపరాధ రుసుంతో డిసెంబర్ 12 వరకు, రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.