ATP: అనంతపురం రాంనగర్ 80 అడుగుల రోడ్డులో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వర్ణకవచ సహిత అయ్యప్ప నూతన పంచలోహ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కుంభాభిషేకం జరుగుతోంది. ఈ కార్యక్రమం నవంబర్ 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. రేపు సాయంత్రం మేళతాళాలతో గ్రామోత్సవం జరుగుతుందని నిర్వహికులు తెలిపారు.