కోనసీమ: బీజేపీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు నియమితులయ్యారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి నుంచి తనకు ఉత్తర్వులు అందాయని ఆయన ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని తెలిపారు.