W.G. భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో కృష్ణంరాజు తెలిపారు. హుండీ లెక్కించగా రూ.1.2కోట్ల ఆదాయం లభించినట్లు ఆయన ప్రకటించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేశామన్నారు.