దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో టీమిండియా వైట్వాట్ అయ్యింది. దీంతో భారత ప్లేయర్ల ఆట తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అంచనాలను అందుకోవడంలో విఫలమైనందుకు క్షమించాలని అభిమానులకు కోరాడు. ‘భారత్కు ప్రాతినిధ్యం వహించడం మాకు గొప్ప గౌరవం.. బలంగా, మెరుగ్గా తిరిగి రావడానికి కష్టపడతాం’ అని వెల్లడించాడు.