NLG: నార్కెట్ పల్లి మండలం బెండపలపహడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ వంగాల రామదాస్ గురువారం 20 కుటుంబాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్‌లోని తన నివాసంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.