MDK: తూప్రాన్ గురుకులంలో అండర్ 14 రగ్బీ రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొనగా క్రీడాకారులను ఎంపిక చేసి క్యాంపు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 12 మంది వంతున రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని వివరించారు.