VZM: గజపతినగరం మండలం భూదేవిపేటకి చెందిన జగ్గినేని గౌరీ (43) కడుపునొప్పి కారణంగా ఈనెల 25 సాయంత్రం గడ్డి మందు తాగిందని ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుమార్తె డొంక పూజిత ఫిర్యాదు చేసిందన్నారు.