HYD: చర్లపల్లి పారిశ్రామికవాడ దశాబ్దాలుగా వేల మంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, కష్టజీవులకు బతుకునిచ్చిన నేలగా మారింది. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడ జీవిస్తున్నారు. యంత్రాల చప్పుళ్లు, కార్మికుల హడావుడితో నిత్యం సందడిగా ఉండే ఈ ప్రాంతం, వారి విభిన్న సంస్కృతులు కలగలిసి ఉండటంతో మినీ ఇండియాను తలపిస్తోంది.