ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి పీక్స్‌కి చేరింది. హర్యానాలో ఓ కారు నంబర్ ప్లేట్ ఏకంగా రూ.1.17 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ‘HR88B8888’ అనే నంబర్ కోసం జరిగిన వేలంలో.. ఓ వ్యక్తి ఇంత భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నాడు. కారు ధర కంటే నంబర్ ప్లేట్ ధరే ఎక్కువ ఉండటం చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.