CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాలకృష్ణారావు కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.