ADB: తాంసి మండలంలో మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన భర్తను రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ CI ఫణిదర్ తెలిపారు. కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్ మద్యానికి బానిసై భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 23న భార్య లావణ్యపై ఇనుప పట్టితో దాడి చేశాడు. ఈ ఘటనపై బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి నరేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు CI వెల్లడించారు.