BHPL: జిల్లాలో 12 మండలాల్లోని 248 గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో నాలుగు మండలాలకు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇతర పార్టీల్లో టికెట్ ఆశావాహులు దరఖాస్తులతో క్యూ కడుతున్నారు. దీంతో ప్రముఖ పార్టీ కార్యాలయాల్లో ఆశావహుల రద్దీ నెలకొంది.