KRNL: సి. బెళగల్ మండల పరిధిలోని బురాన్ దొడ్డి, కొత్తకోట గ్రామాలలోని మండల పరిషత్ పాఠశాలలను ఎంఈఓలు జ్యోతి, ఆదం బాషా బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల్లో పఠన, లేఖన నైపుణ్యాలను పరీక్షించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు.