ప్రకాశం: ఒంగోలు అన్నవరప్పాడు రెండే రోడ్డులోని ట్రాన్స్ఫార్మర్ బుధవారం రాత్రి ఒక్కసారిగా భారీ శబ్దంతో నిప్పులు చిమ్మడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఆ ప్రాంతంలో తరచూ ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా అకస్మాత్తుగా శబ్దం రావడంతో ప్రజలు హడలిపోయారు. నిప్పులు కిందపడటం కూడా ఆందోళన పెంచింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.