MBNR: 2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం ఉమ్మడి పాలమూరు జిల్లా మఖ్తల్‌కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు లభించింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన, రంగస్థల కళల్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని జనవరి 2న ప్రదానం చేయనున్నారు.