ELR: జాతీయ రహదారి సమీపంలోని ఉండ్రాజవరం వంతెన వద్ద బుధవారం చైన్ స్నాచింగ్ జరిగింది. ఉంగుటూరుకు చెందిన పిల్ల సత్యవతి.. ఉండ్రాజవరంలో ఓ వివాహానికి వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని రెండు కాసుల బంగారు గొలుసును తెంచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివాజీ తెలిపారు.