MBNR: నవాబుపేట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన వారు ఈసారి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తూ ప్రచారానికి ఆసక్తి చూపుతున్నారు.