దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. అయితే, సౌతాఫ్రికా అలవోకగా 489 పరుగులు చేసిన చోట టీమిండియా అతి కష్టం మీద 201 పరుగులు చేసింది. గౌహతి టెస్టులో సఫారీ ప్లేయర్లు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. కానీ, మన బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో టెస్టు క్రికెట్లో భాగస్వామ్యాలు ఎంత ముఖ్యమో ఈ టెస్ట్ ఫలితాలు చెప్తున్నాయి.