WGL: పర్వతగిరి మండలంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సొసైటీ ఛైర్మెన్ యం. మనోజ్ గౌడ్ ఇవాళ పరిశీలించారు. వర్షాలు వచ్చే అవకాశంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా హమాలీలతో మాట్లాడి వడ్ల ఎగుమతులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.