MLG: జిల్లాలోని 10 మండలాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 2,29,159 మంది ఓటర్లలో 1,18,299 మంది మహిళలు, 1,10,838 మంది పురుషులు ఉన్నారు. పురుషుల కంటే 7,461 మంది మహిళలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మంగపేటలో 19,913 మంది మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కన్నాయిగూడెంలో 5,085 మంది మాత్రమే ఉన్నారు.