భూపాలపల్లి మండలం నగరం గ్రామానికి చెందిన పాయిలి తిరుపతి కుమారుడు అనారోగ్యంతో సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ ఆసుపత్రికి చేరుకొని బాలుడిని పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, హాస్పిటల్ యాజమాన్యానికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.