AKP: జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సులను రవాణా అధికారులు శుక్రవారం తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి జీ.మనోహర్ తెలిపారు. భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు పరిశీలించినట్లు పేర్కొన్నారు. మొత్తం 106 పాఠశాలలకు చెందిన బస్సులను తనిఖీ చేయగా లోపాలు గుర్తించిన 95 బస్సులకు నోటీసులు జారీ చేసామన్నారు.