KKD: కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న సామర్లకోటను అధికారికంగా పెద్దాపురం డివిజన్‌కు మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసిందని కలెక్టర్ షన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కాకినాడ జిల్లాలో 21 నుంచి 20 మండలాలుగా మారనుందన్నారు. ఈ మార్పుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని 30 రోజుల్లోగా కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని ఆయన సూచించారు.