VZM: జిల్లాలో డిసెంబర్ 5న జరగబోయే తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి కోరారు. పీటీఎంల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా ప్రతినిధులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులంతా వచ్చే విధంగా చూడాలని కోరారు.