HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరిధిలో భూముల వేలం పాట కొనసాగుతోంది. కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలోని 15,16 ప్లాట్లకు వేలం పాట జరుగుతోంది. ఈ వేలంలో ఇప్పటికే ఎకరం భూమి ధర రూ. 140 కోట్లు దాటింది. కాగా, గత వారం ఇదే లేఅవుట్లలో ఎకరం అత్యధికంగా రూ. 137 కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే. ఈసారి ఆ రికార్డును ఈ తాజా వేలం పాట అధిగమించింది.